Wednesday, May 8, 2024

తెలంగాణాలో అదుపులోనే అప్పులు – కాగ్

ఆర్థిక నిర్వహణ భేష్‌: కాగ్‌
నిర్దేశిత శాతంలోనే ద్రవ్యలోటు
రాబడులు ప్రాథమిక వ్యయాలను భరించే స్థాయిలో లేవు
అంచనాలకు, వాస్తవాలకు తేడా తగ్గించేలా బడ్జెట్‌ను హేతుబద్దీకరించాలి
శాసనసభ ఆవెూదం లేకుండా వ్యయాలు
ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆర్థిక నిర్వ హణ భేషుగ్గానే ఉందని, అప్పులు, ద్రవ్యలోటు నిర్దేశిత శాతాలకు లోబడే ఉన్నాయని కాగ్‌ (కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌)‘నివేదిక వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన శాతాలకు లోబడే తెలం గాణలో ద్రవ్యలోటు, చెల్లించాల్సిన రుణ బాధ్యతలు ఉన్నాయని కితాబిచ్చింది. ప్రాథమిక లోటులో తగ్గు దల ఉన్నప్పటికీ ప్రాథమిక వ్య‌యాలను భరించే స్థాయిలో అప్పులు మినహా ఇతర రాబడులు మాత్రం లేవని కాగ్‌ వెల్లడించింది. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా తగ్గేలా బడ్జెట్‌ తయారీ ప్రక్రియను హేతుబద్ధీకరించాలని ప్రభు త్వానికి కీలక సూచన చేసింది. వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్య, రవాణా, క్రీడలు, కళలకు కేటాయిపులు, వ్యయాలు తగ్గిస్తోందని అభిప్రా యపడింది. సాగునీటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ ఆర్థిక ఫలాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించడం లేదని కాగ్‌ పేర్కొంది. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదిక సమర్పించింది. శుక్రవారం శాసనసభకు సమ ర్పించిన నివేదికలో కీలక సూచనలు చేసింది. రాష్ట్ర ఆర్థి క స్థితిగతులపై కాగ్‌ ఇచ్చిన నివేదికలో రెవెన్యూ రాబ డి, వ్యయాల పెరుగుదలపై 2015-16 నుంచి 2018- 19 నాటికి మెరుగు పడిందని పేర్కొంది. జీఎస్టీడీపీలో రెవెన్యూ రాబడి, ఖర్చులు తగ్గినట్లు గుర్తించింది. గతం తో పోల్చినా, జీఎస్డీపీతో పోల్చిచూసినా క్యాపిటల్‌ వ్యయం తగ్గిందని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం నిర్దెశించిన 3.25 శాతంకన్నా ద్రవ్యలోటు జీఎస్డీపీలో తక్కువగా అంటే 3.11 శాతంగా ఉందని తెలిపింది. చెల్లించాల్సిన రుణ బాధ్యతలు జీఎస్డీపీతో పోల్చితే 14వ ఆర్థిక సంఘం నిర్దేశిత 23.33 శాతం కన్నా తక్కు వగా 22.75శాతంగా ఉన్నాయని కితాబిచ్చింది. 2019 మార్చి నాటికి ప్రభుత్వ అప్పుల్లో 46శాతం రూ.76,262 కోట్లు రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉందని, శాసనసభ ఆమోదం లేకుండా 2014-15 నుంచి 2017-18 మధ్య రూ.55,517 కోట్లు అధికంగా ఖర్చు చేసిందని, వీటిని నియంత్రించాలని, ఇందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాగ్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసిం ది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, సామాజిక ఆర్థిక రంగాలపై కాగ్‌ సమగ్ర వివరణనిచ్చింది. విద్యుత్‌ సంస్థల దీర్ఘకా లిక రుణాలు రూ.36,732 కోట్లు ఉదయ్‌ పథకంతో రూ.7,723 కోట్లుగా పేర్కొంది. మొబైల్‌ ఫోన్ల అమ్మ కంపై తక్కువ పన్ను వేయడంతో రూ.43.89 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో తెలిపింది. విద్యుత్‌ రంగంలో డిస్కంల భారీ నష్టాలు పీయూసీల నష్టానికి కారణమైందని పేర్కొంది. పీయూసీల నష్టం రూ.28,426 కోట్లుగా తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థ తక్షణ అవసరాల నిధుల నిర్దిష్ట అంచనా లేకుండా అధిక వడ్డీ రుణం రూ.539 కోట్లు వాడుకున్నదని తేల్చిన కాగ్‌ దీని ఫలితంగా 8.51కోట్ల వడ్డీ వ్యయం అయిందని తన నివేదికలో పేర్కొంది.
ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కాగ్‌
2018-19 బడ్జెట్లో తప్పుడు వర్గీకరణతో రెవిన్యూ మిగులు చూపారని తప్పులు చూపింది. ఈ ఏడాదిలో వాస్తవానికి రూ.4337 కోట్ల రెవెన్యూ మిగులు అవాస్తవని, తమ అధ్యయనంలో రూ.5114 కోట్ల రెవెన్యూ లోటు ఉందని తేలిందని స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో వడ్డీల భారం అధికంగా ఉందని, సగటున 6.93 శాతం వడ్డీలు చెల్లిస్తున్నారని పేర్కొంది. వడ్డీ చెల్లింపుల్లో 16 శాతం పెరుగుదల ఉందని, ఇది మంచిదికాదని పేర్కొంది. రెవెన్యూ రాబడితో పోలిస్తే 12.41 శాతంగా ఉన్న వడ్డీ చెల్లింపులు సరికాదని వ్యాఖ్యానించింది. 14 ఆర్థిక సంఘం నిర్దేశిత నిబంధనల ప్రకారం ఇది 8.37 శాతం మించరాదని కాగ్‌ వ్యాఖ్యానించింది. విద్యా రంగం పై కేటాయిపులు తక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంతో రూ.87 వేల కోట్ల మేర అంచనాలు పెరిగాయని తెలిపింది. బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే రూ.3507 కోట్లు ఖర్చు చేశారని తప్పుపట్టింది. ఇది ఆర్థిక నియంత్రణ వ్యవస్థను అతిక్రమించడమే, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యమేనని పేర్కొంది. 2014 నుంచి 2018 వరకు బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే రూ.55,517 కోట్లు ఖర్చు చేశారని తప్పుపట్టింది.
సామాజిక రంగంపై కాగ్‌ వ్యాఖ్యలు
హదరాబాద్‌లో ప్రతి వ్యక్తికి రోజుకు 150 లీటర్ల ఇస్తున్నామన్నారని, కానీ 70 లీటర్లకు మించి ఇవ్వడం లేదని కాగ్‌ పేర్కొంది.
దేవాలయ భూముల్లో 23 శాతం ఆక్రమణ‌ల్లో ఉన్నాయి.
దేవాలయ భూముల పరిరక్షణ కోసం సరైన యంత్రాంగం లేదు.
20,124 ఎకరాల భూమి కబ్జా అయితే 3488 ఎకరాలపై మాత్రమే కేసులు వేశారు.. ఇది కేవలం 17.33 శాతం భూమి మాత్రమే
ఆడిట్‌ చేసిన 24 మండలాల్లో రూ.1096 కోట్ల విలువ గల 12,666 ఎకరాలు కబ్జా అయ్యింది.
కాగ్ నివేదిక పూర్తి వివ‌రాలు..
2014- 2018 మధ్య విద్యుత్‌ సంస్థలకు వచ్చిన నష్టం రూ.13,533 కోట్లు
జెన్‌ కో రూ.3518 కోట్లు, ట్రాన్స్‌ కో రూ.532 కోట్ల లాభాలు
డిస్కమ్‌లు రూ.17,580 కోట్ల నష్టం
విద్యుత్‌ సంస్థల దీర్ఘకాలిక రుణాలు రూ.36,732 కోట్లు
ఉదయ్‌ పథకంతో రూ.7,723 కోట్లు వచ్చాయి
తెలంగాణ సర్కార్‌ రూ.20,785 కోట్ల పెట్టుబడులు
మొబైల్‌ఫోన్‌ల అమ్మకంపై తక్కువ పన్ను వేయడంతో రూ.43.89 కోట్ల నష్టం
2014-19 మధ్య ఆర్టీసీ నష్టాలు రూ.928 కోట్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement