Saturday, April 27, 2024

ఉద్యోగాలు భర్తీచేసి ఆత్మహత్యలు ఆపండి..

కవాడిగూడ : తెలంగాణలో పిఆర్‌సి నివేధిక ప్రకారం లక్షా 93 వేల 5వందల ఉద్యోగాలు వెంటనే భర్తీచేసి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యానగర్‌లోని బిసి భవన్‌లో నిరుద్యోగ జేఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కేయు విద్యార్థి సునిల్‌ నాయక్‌ ఉద్యోగం రాదనే నిరాశతో ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసకోవాలని ఆయన కోరారు. సిఎం కెసిఆర్‌ ఇటీవల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పే రివిజన్‌ కమీషన్‌ తెలిపిన ప్రకారం 1లక్ష 93 వేల 500 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన సూచించారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు గురై అసంతృప్తికి లోనవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసి నేతలు నీల వెంకటేష్‌, సుధాకర్‌, చంటి, సతీస్‌, బబ్లుగౌడ్‌, చం ద్రశేఖర్‌, బ్రహ్మాయ్య, రవి తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement