Tuesday, April 13, 2021

కవి జహంగీర్‌ జీ కి ఘన సన్మానం..

కొత్తూర్‌ : 78 వసంతల స్వాతంత్ర భారత అమృత మహోత్సవ వేడుకల్లో కవి జహాంగీర్‌ జీ (జాజీ) జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణం కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గోని తన కవితా గానం స్వాతంత్ర భారతమా శీర్షికతో వినిపించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ తిరుపతి రావు, జిల్లా విద్యాధికారి విజయ కుమారి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పద్మశ్రీ, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్‌రావులు హాజరయ్యారు. అనంతరం జహంగీర్‌ జీని ఘనంగా సన్మానించి, పారితోషకంతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై జైభవానీ సేవా సమితి సభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News