Sunday, May 5, 2024

HYD: సరూర్‌న‌గర్ చెరువును పరిశీలించిన జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్

కర్మన్ ఘాట్, ఫిబ్రవరి 13 (ప్రభ న్యూస్) సరూర్‌న‌గర్ చెరువు ను ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సంబంధిత అధికారుల ను ఆదేశించారు. జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి జిహెచ్ఎంసి కమిషనర్ దృష్టికి పలు సమస్యలతో పాటు సరూర్ న‌గర్ చెరువును బ్యూటిఫికేషన్ చేసేందుకు చెరువును పరిశీలించాలని కోరగా జిహెచ్ఎంసి కమిషనర్ వివిధ శాఖల అధికారులు మంగళవారం ఉదయం సరూర్నగర్ చెరువు ప్రాంతాన్ని పరిశీలించి సరూర్‌న‌గర్ చెరువు రెండు జోన్ల పరిధిలో ఉండకుండా ఎల్బీనగర్ పరిధిలో ఉండే విధంగా అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు.

దీంతోపాటు గ్రీన్ పార్క్ కాలనీ చెరువు పరిధిలో లేని సర్వే నెంబర్లకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తపో వన్ కాలనీలో మ్యానుఫ్యాక్చర్ జోన్ నుండి తొలగిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు ఉన్నందున వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. సరూర్నగర్ చెరువు లో పూర్తిగా షిల్టు చెత్తాచెదారాన్ని తొలగించే విధంగా అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. 30 శాతం ఉన్న గుర్రపు డెక్క పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఎల్బీనగర్ నియోజకవర్గం తో పాటు సరూర్ న‌గర్ చెరువు సమస్యలను తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. సమస్యలన్నిటిని పరిష్కరించనున్నట్లు తెలిపారు. సరూర్నగర్ చెరువులో దుర్వాసనతో పాటు పేరుకుపోయిన షెల్టును తొలగించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

చార్మినార్ జోన్ పరిధిలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోగల సింగరేణి ఆఫీసర్స్ కాలనీ వాసుల ఎదుర్కొంటున్న సమస్యలను కాలనీ కి చెందిన కె ఆర్ సి రెడ్డి సర్వేశ్వరరావు కమిషనర్ కు సమస్యలను పరిష్కరించాలని కోరగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోనికి పూర్తిగా చెరువును అప్పగించనున్నట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన వివరిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వారు తెలిపారు. చెరువు చుట్టూ బండు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని అట్టి పనులను పూర్తి చేయాలని చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ అశోక్ రెడ్డి,కోటేశ్వరరావు,ఇరిగేషన్ అధికారి పవన్, డిప్యూటీ కమిషనర్లు దశరథ్,అరుణకుమారి సిటీ ప్లానర్ ప్రసాద్ జిహెచ్ఎంసి ఏ. ఈ విజయ్ కుమార్, శానిటేషన్ డి ఈ వెంకటేశ్వర్లు ఎంటమాలజీ ఎస్ ఇ రజిని, మనమ్మ, గ్రీన్ పార్క్ కాలనీ అధ్యక్షులు జగన్ రెడ్డి,టెంపుల్ వైస్ చైర్మన్ బాల్రెడ్డి,శ్రీరామ్ నగర్ కాలనీ అధ్యక్షులు శివ గౌడ్,తపోవన్ కాలనీ మధు, ప్రసాద్ త్రిమూర్తి కాలనీ సురేష్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్త, జూపల్లి ప్రవీణ్,ప్రవీణ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రోహిత్,నరేందర్ నరేష్,కరుణ్ వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement