Sunday, April 28, 2024

HYD: గంజాయి సీజ్‌.. యువకుడు అరెస్టు

హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు సీజ్‌చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 250 గ్రాముల మత్తుమందు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకానికి సిద్ధం చేశాడని చెప్పారు. నిందితుడిని బసవ రాజప్ప ప్రమోద్‌గా గుర్తించారు. గంజాయిని దూల్‌పేట నుంచి సేకరించాడని, దానిని చిన్న ప్యాకెట్లుగా చేసి కూలీలకు విక్రయిస్తున్నాడని చెప్పారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement