Sunday, April 28, 2024

Gold : పెరుగుతున్న పసిడి ధ‌ర‌ల‌కు బ్రేక్‌…

ఇటీవ‌ల బంగారం ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇవాళ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు బ్రేకులు ప‌డ్డాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. తులం బంగారం పై 700 రూపాయలకు పైగా తగ్గింది. అలాగే వెండి ధర కిలో పై 1000 రూపాయలకు పైగా తగ్గింది.

హైదరాబాద్‌లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550 ఉంది.. వెండి ధరలు కిలో రూ.89,000 ఉంది.
ఇక‌, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,550 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,960. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..66,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,700 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,500, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,550 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..

- Advertisement -

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 89,000, ముంబైలో 85,600, ఢిల్లీలో 85,600, బెంగుళూరు లో 84,100,అదే విధంగా హైదరాబాద్ లో 89,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement