Monday, May 13, 2024

విదేశీ విమాన ప్రయాణాలు పెరిగినయ్​.. ఢిల్లీ కంటే హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​ బెటర్​

భారతదేశంలోని ఇతర మెట్రో విమానాశ్రయాలతో పోలిస్తే 2021-22లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యధిక అంతర్జాతీయ ప్యాసెంజ‌ర్ రికవరీ చేయ‌గ‌లిగింది. ఏప్రిల్ 2021-మార్చి 2022లో, హైదరాబాద్ విమానాశ్రయం రికవరీ రెట్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో సమానంగా ఉంది. GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రకారం, హైద‌రాబాద్ విమానాశ్రయంలో గత కొన్ని నెలలుగా ప్రయాణికుల రద్దీ, ఎయిర్ ట్రాఫిక్ మూవ్‌మెంట్స్ క్రమంగా పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ పరిమితుల సౌలభ్యంతో పాటు కోవిడ్-19 క్రమంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. భారతదేశం అంతటా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పుంజుకున్న‌ట్టు తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయంలో గత నెలలో 15 లక్షల మంది దేశీయ ప్రయాణికులు, 2.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. మే 15న హైదరాబాద్ విమానాశ్రయంలో రోజువారీ దేశీయ ప్రయాణీకుల సంఖ్య 53,000 దాటింది, ఇది కోవిడ్‌కు ముందు రోజువారీ సగటు దేశీయ ట్రాఫిక్‌లో 103 శాతం అధికం. జూన్ 10న అంతర్జాతీయ ప్యాసింజర్ విభాగంలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 10,000 దాటింది. కోవిడ్ తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య ఇదే అత్యధికం.

UDAN చొరవ, టైర్ II-టైర్ III నగరాల్లో తక్కువ సేవలందించని/అన్ సర్వ్డ్ ఎయిర్‌పోర్ట్‌లను కనెక్ట్ చేయడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం అంతటా కనెక్టివిటీని మరింత పెంచింది. దీంతో, హైదరాబాద్ విమానాశ్రయం గుల్బర్గా, హుబ్బలికి కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ప్రయాణం పునఃప్రారంభించడంతో, హైదరాబాద్ విమానాశ్రయం ఇప్పుడు లండన్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, దుబాయ్, ఖతార్, షార్జా, దోహా, కువైట్ వంటి న‌గ‌రాల‌కు తిరిగి ప్ర‌యాణాలు ప్రారంభించింది. అంతే కాకుండా.. చికాగో, మాల్దీవులు వంటి కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను పంపిస్తున్న‌రు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement