Tuesday, May 14, 2024

హార‌ర్‌, కామెడీ జోన‌ర్‌లో ‘ఫోన్ భూత్‌’.. మోషన్​ పోస్టర్​ రిలీజ్..

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది కాంబోలో హారర్ కామెడీ జోన‌ర్‌లో ‘ఫోన్ భూత్’ మూవీ తెర‌కెక్కింది. ఈ జానర్ సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నందున, ఈ ముగ్గురు నటీనటులు తమ అభిమానులకు ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఇవ్వ‌డానికి రెడీ అయిపోయారు! కాగా, ఇవ్వాల ఈ మూవీ మేకర్స్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమా విడుదల తేదీని రేపు ఉదయం అంటే 28వ తేదీ 11 గంటలకు వెల్లడించనున్నారు. ఫోన్ భూత్ మూవీకి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లు నిర్మిస్తున్నారు. ఇతర సినిమాలకు భిన్నంగా, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కులకు చాలా అంచనాలు నెల‌కొన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement