Tuesday, May 7, 2024

మాజీ వాయుసేన సైనికోద్యోగుల ఆత్మీయ సమ్మేళనం..

అక్టోబరు 30,31న మాజీ సైనికోద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్య‌క్ర‌మాన్ని హైదరాబాద్ శివారు సెలబ్రిటీ క్లబ్ లో నిర్వ‌హించారు. 1981లో ఇదే రోజున హైదరాబాద్ , బేగంపేట నుండి తెలుగు రాష్ట్రాల యువత, వాయుసేనలో చేరి 40 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ..వారంతా కలుసుకుని, తమ తమ అనుభవాలు, అనుభూతులను పంచుకుని ఆనందించారు. మరల అవకాశమంటూ వస్తే, ఇకముందు కూడా వీరందరూ తమ మాతృభూమి కోసం సేవచేయటానికి సంసిద్దంగా ఉన్నారు. కాగా వర్తమాన‌ కాలంలో స‌మ సమాజ సేవకోసం తమవంతు బాథ్యతను గుర్తు చేసుకుంటూ, తగిన కృషి చేస్తామని ప్రతిజ్ఞ‌ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వేర్వేరు దేశాలు, రాష్ట్రాలలో స్థిరపడ్డ వాయు సైనికులంతా ఒకచోట చేరడంతో.. సెలబ్రిటీ క్లబ్ కళకళలాడింది. ఈ సందర్భంగా సెలబ్రిటీ రిసోర్ట్స్ యాజమాన్యం, ఉద్యోగులు తమవంతు సేవచేసి తమ ఆనందాన్ని వ్యక్తపరచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement