Saturday, April 27, 2024

కార్పొరేటర్ కరుణాకర్ మృతి.. మేయర్, క‌మిష‌న‌ర్ సంతాపం

జి హెచ్ ఎం సి లోని వార్డు నంబర్ 71 గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్ రాగా.. కుటుంబ సభ్యులు వెంటనే బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌లో చేరిన కాసేపటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. దేవర కరుణాకర్ మృతి పట్ల మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న మరణ సమాచారం అందిన వెంటనే మేయ‌ర్ హుటాహుటిన సిటీ న్యూరో హాస్పిటల్ కు వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన గుడి మల్కాపూర్ కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు పనిచేసినట్లు మేయర్ తెలిపారు. కార్వాన్, నాంపల్లి కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. సీనియర్ కార్పొరేటర్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. కార్పొరేటర్ గా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వారనీ, అన్ని పార్టీల కార్పొరేటర్లతో చాలా మంచిగా, సఖ్యతగా సౌమ్యుడు గా ఉండే వారని గుర్తుచేసుకున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ సభ సజావుగా జరిగేందుకు సహకరించేవారని మేయర్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మేయర్ సానుభూతిని వ్యక్తం చేశారు.


దేవర కరుణాకర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన జి హెచ్ ఎం సి కమిషనర్ లోకేష్ కుమార్ :
గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 71 వార్డు గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించ‌డం ప‌ట్ల‌ జి హెచ్ ఎం సి కమిషనర్ డి యస్ లోకేష్ కుమార్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు పనిచేశారని, ఎంతో సామ్యుడుగా పేరు గాంచార‌ని, ఆయన మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కమిషనర్ ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు కమిషనర్ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement