Tuesday, May 14, 2024

పెద్ద ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం – ముగ్గురు దుర్మరణం..

హైదరాబాద్‌ : పెద్ద అంబర్ పేట అవుటర్ రింగ్ రోడ్డుపై నేటి తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు… అవుటర్ పై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు అందులో ఇరుకుపోగా.. వాటిని పోలీసులు వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమదానికి, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement