Monday, May 6, 2024

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. బస్సు-ఆటో ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్‌లో ఓ ఆటో వేగంగా వెళ్తూ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే 8 మంది మహిళలు, ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా.. మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement