Sunday, May 19, 2024

TS: నీటి సంపులో పడి.. బాలుడు మృతి

నీటి సంపులో పడి బాలుడు మృతిచెందిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో ప‌డి మృతిచెందాడు.

సానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు కొడుకు అన్విత్ (3) ఇవాళ‌ ఉదయం ఇంటి ముందు బాల్ తో ఆడుకుంటుండగా బాల్ నీటి సంపులో పడడంతో బంతి కోసం సంపులోకి వంగిన చిన్నారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే చిన్నారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement