Saturday, May 4, 2024

ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం- నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

ప‌లు రాష్ట్రాల‌తో పాటు జిల్లాలలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో సింగరేణి జేకే 5 ఓసీ కోయగూడెం ఓసీలలో పనులు నిలిచిపోయాయి. దీంతో 20 వేల టన్నుల బొగ్గుఉత్పత్తికి ఆటంకంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో కూడా వర్షం కురుస్తున్నది. దీంతో రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జడ్చర్లలో రాత్రి కురిసిన వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement