Saturday, April 27, 2024

కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట శాపం

కేంద్ర ప్రభుత్వ అసమంజస విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు  పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఏడేళ్ల టీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మేలు జరుగుతున్నదన్నారు. రైతులు జర బాగుపడుతుంటే కేంద్రం యాసంగిలో వడ్లు కొనమంటున్నారని మండిడ్డారు. యాసంగిలో తెలంగాణలో దొడ్డు వడ్లు పండుతాయి.. అవి బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయని చెప్పారు. పంజాబ్‌లో వడ్లను ఎలా కొంటారు..? తెలంగాణలో ఎందుకు కొనరు..? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దేశంలో రైతుకు పెట్టుబడి సాయం, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఒక్క వ్యవసాయం మీదనే ప్రభుత్వం 30 వేళ కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి సారి వడ్లు కొనబోమని చెప్పిన ఘనత బీజేపీదేని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: కుప్పంలో కుక్కల్లా మొరుగుతున్నారు: వైసీపీపై నారా లోకేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement