Thursday, May 2, 2024

అల్లం సారుకు హ్యాపీ బర్త్ డే.. భూపాలపల్లి ప్రెస్ క్లబ్ లో సంబురాలు..

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనీ కాకతీయ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణి చేసి, సంబురాలు జరుపుకున్నారు. కరోనా కాలంలో వేలాది మంది జర్నలిస్టులను ఆదుకున్న అల్లం నారాయణ పదికాలాల పాటు సంతోషంగా ఉండి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జయ శంకర్ భూపాలపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ నాయకులు ఆకాంక్షించారు..


ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ నాయకులు కెక్కర్ల జగన్, సర్వేశ్వర రావు, ఎర్రం సతీష్ కుమార్, బొడ్డు వంశీ, మంతెన సమ్మయ్య, చెరుకు సుధాకర్, అంబాల సంపత్, కొల్లోజు రంజిత్, పృధ్వీ క్యాతం వెంకటేశ్వర్లు, పావుషెట్టి శ్రీనివాస్, రడపాక రమేశ్, బోల్లేపల్లి జగన్, బండ మోహన్, మధు, ఇమ్రాన్ ఉదయ్, నాగేశ్వర్ రావు, రాంబాబు, పవన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement