Friday, April 26, 2024

హైద‌రాబాద్‌లో శీల‌వ‌తి.. సీరియ‌స్ అవుతున్న సిటీ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్‌

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గుప్పుమంటున్న గంజా యిపై పోలీసులు గురిపెట్టినట్లు కనిపి స్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు గంజాయి అక్రమ రవా ణాను అరికట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. నగర సీపీ అంజనీ కుమార్‌ మంగ ళవారం ఒక్కరోజే 23 మంది నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు ఆపరేషన్‌ గంజాయి పేరి ట నిరంతరం వేట కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిష నరేట్‌ పరిధిలో ఒకే రోజు 23 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయడం ద్వారా సీపీ అంజనీ కుమార్‌ గంజాయి రవా ణాదారులపై ఉక్కుపాదం మోపినట్ల యింది. ఇందులో సెంట్రల్‌ జోన్‌ పరిధిలో మహ్మద్‌ జహంగీర్‌(టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్‌, షేక్‌ జమాల్‌(ఆటో డ్రైవర్‌), మహ్మద్‌ వసీం(డ్రైవర్‌, పీ.ఈశ్వర్‌ రావు(రైతు), జే.ఈశ్వర్‌ రావు (రైతు), మువ్వల సంజీవరావు (వ్యవసాయం), పాలూరి రామకృష్ణ (ఆటో డ్రైవర్‌), కే.రమణ(వ్యవసాయ కూలీ), జే.మహేశ్‌(వ్యవసాయం)లపై రాంగోపాల్‌ పేట్‌ పోలీస్‌ స్టే షన్‌లో పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. వీరితో పాటు ఈస్ట్‌ జోన్‌ పరిధిలో బోదాసు శివ (వ్యవసాయం), మహ్మద్‌ ఖలీముద్దీన్‌ (చాయి వాలా), మహ్మద్‌ మథీన్‌ పాషా(కూలీ), కే.గోపాల్‌ (వ్యవసా యం), కొప్పోజి చిన్నబ్బాయి(వ్యవ సాయం), ముఖేష్‌ సింగ్‌(కార్పెంటర్‌) లపై అఫ్జ ల్‌ గంజ్‌ పోలీస్‌ స్టే షన్‌ పరిధిలో పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. నార్త్‌ జోన్‌ పరిధిలోని గోపాలపురం పోలీస్‌ స్టే షన్‌ లో నాలం శివ(జేసీబీ ఆపరేటర్‌, చిన్ని దుర్గాప్రసా ద్‌లపై, సౌత్‌ జోన్‌ పరిధి లోని చాంద్రా యణగుట్ట పీఎస్‌ లో ఎండీ.నదీం (డ్రైవర్‌, మహ్మద్‌ అలీ ముద్దీన్‌(ఆటో డ్రైవర్‌), సింగ్‌ (డ్రైవ ర్‌)లపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. వెస్ట్‌ జోన్‌ పరిధిలో మంగళ్‌ హాట్‌ పీఎస్‌లో నర్సింగ్‌ సింగ్‌(కార్పెం టర్‌), హుమా యన్‌ నగర్‌ పీఎస్‌లో బీ.నానక్‌ (వ్యవ సాయం), కుల్సుంపూర పీఎస్‌లో వికాస్‌ జాదవ్‌ లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి, జైలుకు తరలించినట్లు సీపీ కార్యాలయ వర్గాలు వెల్లడిం చాయి.
మత్తుతో చిత్తు కావొద్దు : సీపీ అంజనీకుమార్‌
గంజాయి వంటి మత్తు పదార్థా లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర సీపీ అంజనీ కుమా ర్‌ కోరారు. గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయాలను ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించా రు. ఈ సందర్భంగా గడిచిన కొన్ని నెలల్లో 23 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి, జైలుకు తరలించామని వివరించారు. గంజాయి నిషేధాన్ని అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నామని, గంజా యి, లేదా ఇతర సమాచారం తెలిస్తే స్థానిక పోలీస్‌ స్టే షన్‌లో కాని, పెట్రో లింగ్‌ వాహనాలకు, బ్లూ కోల్ట్‌ సిబ్బం దికి, లేదా 9490616555 నెంబర్‌కు వాట్సప్‌ ద్వారా తెలియజేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement