Monday, April 29, 2024

బస్తీదవాఖాన, రజక సంఘం , ముస్లీం సొసైటీల భవన నిర్మాణ పనులకు మంత్రి గంగుల శంకుస్థాపన

రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లో విస్తృత పర్యటన చేపట్టారు. ఈమేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ… పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి… నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కరీంనగరంలోని పద్మనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ మంత్రికి ఘనస్వాగతం పలికారు. బస్తీ దవాఖాన వైద్యులచే మంత్రి గంగుల కమలాకర్ వైద్యపరీక్షలు చేయించుకున్నారు.అనంతరం అదే ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతోపాటు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమీషనర్ సేవ ఇస్లావత్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ఇతర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

యూ నైటెడ్ బీసీ ముస్లీం సొసైటీ బిల్డింగ్కు భూమి పూజ

కరీంనగరంలోని సప్తగిరి కాలనీలో మంత్రి గంగుల పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీలో నూతనంగా నిర్మించనున్న యునైటెడ్ ముస్లీం బీసీ సొసైటీ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ముస్లీం మైనార్టీ నాయకులు మంత్రి గంగుల కమలాకర్ కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతోపాటు కార్పొరేటర్ దిండిగాల మహేష్, యునైటెడ్ ముస్లం బీసీ సొసైటీ ప్రతినిధులు కలీమ్, షాదుల్, అజీమ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

రజక సంఘం భవనానికి భూమి పూజ

- Advertisement -

కరీంనగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. ఈమేరకు నగర శివారులోని మార్కండేయ నగర్ ప్రాంతంలో మడలేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా పలువురు రజక సంఘ నాయకులు మంత్రికి ఘనస్వాగతం పలుకుతూ… శాలువాలతో సత్కరించారు.సుమారు 10 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల తోపాటు మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ దిండిగాల మహేష్, రజక సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement