Sunday, May 12, 2024

ఆటోలో మరిచిపోయిన బంగారు గాజులు- సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అప్పగింత

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): ఓ ప్రయాణికుడు ఆటోలో మరిచిపోయిన బంగారు గాజులను పోలీసులు సీసీ కె మెరాల ఆధారంగా గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించారు. పెద్దపల్లికి డెకరేషన్‌ సామాన్ల‌తో వస్తున్న ఆటో టీఎస్‌ 02 యూటీ 7147లో గోదావరిఖనికి చెందిన బొజ్జ పురుషోత్తం అనే బంగారం వ్యాపారి జూలపల్లి వద్ద ఎక్కాడు. పెద్దపల్లికి చేరుకున్న అనంతరం ఆటో దిగి వె ళ్లిపోయిన ఆయన బంగారు గాజులు కలిగిన సంచిని మరిచిపోయాడు. ఆ తర్వాత తేరుకొని బస్టాండ్‌ వద్ద ఆటో కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రాజేశ్‌ వెంటనే స్పందించి ఎస్‌ఐ-2 రాజవర్దన్‌, సిబ్బంది దుబాసి రమేశ్‌, శరత్‌లతో కలిసి గాలింపు చేపట్టారు. సీసీ కెమరా ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించి ..ఆరా తీయగా కరీంనగర్‌కు చెందిన హైమద్‌ఖాన్‌గా ధృవీకరించారు. ఆటోడ్రైవర్‌ను సంప్రదించగా తన ఆటోలోనే ఉన్న బంగారు గాజుల బ్యాగును గుర్తించి నిజాయితీగా ఎస్‌ఐకి అప్పగించారు. అనంతరం బాధితుడిని పిలిపించి 3 తులా బంగారం గాజుల బ్యాగును ఎస్‌ఐ రాజేశ్‌ సిబ్బందితో కలిసి అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను ఎస్‌ఐ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement