Saturday, April 27, 2024

Ts | శ్రీశైలం జలాశయానికి నెమ్మదిగా చేరుకుంటున్న వరదలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన కృష్ణా నదీ ఆధారిత జలాశయాల నీటి మట్టాలు అడుగంటి పోగా ప్రస్తుతం జూరాల, హంద్రీనివా నుంచి క్రమేణ ప్రవాహం శ్రీశైలంలో చేరుతుంది. శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 825 అడుగులకు చేరుకుంది. అలాగే నీటి నిల్వసామర్ధ్యం 215.81 కాగా ప్రస్తుతం 44.74 టీఎంసీలకు చేరుకుంది. గురువారం ఈ 33 టీఎంసీలు ఉన్న నీటి మట్టం శుక్రవారం నాటికి చేరుకోగా క్రమేణ 44. 74 చేరుకోవడంతోపాటుగా 66.800 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలొకి వస్తుంది. ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు ఈ విధంగా ఉన్నాయి.

ఎగువ కర్ణాటక నుంచి ఆల్మట్టి, నారాయణ పూర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేస్తే జూరాల నుంచి క్రమేణ ప్రాజెక్టులు నిండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కృష్ణా నది ఇన్‌ ఫ్లో 36వేల 500 క్యూసెక్కులకు చేరుకోగా ఔట్‌ ఫ్లో కు విడుదలకు నీరు లేకపోవడంతో కేవలం ఇన్‌ ఫ్లో కే పరిమితమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement