Thursday, May 9, 2024

టీఎస్‌ఈసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. 29 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌-ఈసెట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈమేరకు టీఎస్‌ఈసెట్‌ -2023 మొదటి విడత సీట్ల కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. షెడ్యూల్‌ కోసం ఫీజు చెల్లింపుతోపాటు స్లాట్‌ బుకింగ్‌ ఈ నెల 29నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు చేపట్టనున్నారు.

- Advertisement -

ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువును ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీట్ల తాత్కాలిక భర్తీని ఆగస్టు 8న ప్రకటించనున్నారు. విద్యార్థులు వీలైనంత త్వరగా స్లాట్‌ బుక్‌ చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైతే సీట్ల ఆప్షన్లు ఇచ్చుకునేందుకు తగినంత సమయం లభిస్తుందని సూచించారు. ఇందుకు వెంటనే ఫీజును చెల్లించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. పూర్తి వివరాలకు విద్యార్థులు టీఎస్‌ఈసెట్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. మొత్తం 36 విభాగాల్లో 12071 సీట్లు టీఎస్‌ఈసెట్‌ కింద భర్తీ కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement