Monday, May 20, 2024

AP: జైలుకు పోయేవాళ్లు కావాలా… ఇక్క‌డ ఉండే వాళ్లు కావాలా…ష‌ర్మిల

క‌డ‌ప ఓట‌ర్ల‌ను తేల్చుకోమ‌న్న ష‌ర్మిల‌
ఎన్నిక‌లైన‌ వెంట‌నే అవినాష్ రెడ్డి అరెస్ట్ త‌థ్యం
ఏపీలో హ‌త్య‌లు చేయించ‌డానికి అధికారాన్ని వాడుతున్నారు..
ఒక‌ప్పుడు అన్న జ‌గ‌న్ అధికారం కోసం పోరాడా…
ఇప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వ‌చ్చి పోరాడుతున్నా..

పులివెందుల: జైలుకు పోయేవాళ్లు కావాలా… ఇక్క‌డ ఉండే వాళ్లు కావాలా తేల్చుకోవాల‌ని క‌డ‌ప ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షురాలు ష‌ర్మిల కోరారు.. ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి అరెస్ట్ త‌ధ్య‌మంటూ జోస్యం చెప్పారు.. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ… కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని విమర్శించారు.

ఏపీలో హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. అవినాష్‌ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నామ‌ని, కాల్‌ రికార్డ్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఆధారాలన్నీ ఉన్నాయిని వివ‌రించారు.. బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారంటూ మండిప‌డ్డారు. జగన్‌కు అధికారమిచ్చింది అవినాష్ ను కాపాడటానికేనా? అంటూ ప్ర‌శ్నించారు. ఒకప్పుడు అన్నఅధికారం చేప‌ట్ట‌డం కోసం పాదయాత్ర చేశాన‌ని, ఇప్పుడు న్యాయం కోసం నిలబడి పోరాడుతున్నాన‌ని అన్నారు… న్యాయం గెలుస్తుందా ? నేరం గెలుస్తుందా ? అని ప్రపంచమంతా చూస్తోంద‌ని అంటూ, కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని షర్మిల అభ్య‌ర్ధించారు.

కోర్టు తీర్పుకంటే ప్ర‌జా తీర్పు ముఖ్యం…
తన తండ్రిని దారుణంగా హతమార్చారని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చన్నారు. ప్రజా తీర్పు పెద్దదని.. దానికోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ”వైఎస్‌ అవినాష్‌రెడ్డి రేపో మాపో జైలుకు పోతారు.. జైలుకు పోయేవారు కాదు.. జనాల్లో ఉండేవాళ్లు రావాలి.. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మకు శాంతి కలిగించండి” అని సునీత కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement