Thursday, May 2, 2024

ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్​.. వేలంలో కాసుల వర్షం

వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కో వాహనానికి లక్షలు వెచ్చించి కోరిన నంబర్ సొంతం చేసుకుంటున్నారు. వాహన యజమానుల్లో పెరుగుతున్న నంబర్ల క్రేజ్ రవాణాశాఖకు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. తాజాగా ఫ్యాన్సీ నంబర్ల వేలం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి కాసుల వర్షం కురిపించింది. బుధవారం నిర్వహించిన వేలం పాటలో పలు ఫ్యాన్సీ నంబర్ల విక్రయం ద్వారా మొత్తంగా రూ.30.83 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా టీఎస్‌09 ఎఫ్‌యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్‌ చేసి గిరిధారి కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుందని చెప్పారు. టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0009 నంబరును రూ.3,50,0005 చెల్లించి సీహెచ్‌ అనంతయ్య అనే వినియోగదారుడు దక్కింకుకున్నారని పేర్కొన్నారు. టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0001 నంబరును రూ,3,50,000కు రేజర్‌ గేమింగ్‌ సంస్థ దక్కించుకుందని తెలిపారు. వీటితోపాటు పలు ఇతర నంబర్లను కూడా వేలం వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement