Sunday, April 28, 2024

Date Fix – ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదిన ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న కెసిఆర్ …

హైద‌రాబాద్ – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఫిబ్రవరి ఒకటో తేదీన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా గత ఏడాది నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. దీంతో ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిపోవడంతో కేసీఆర్ కు గాయమైంది. అనతరం ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. ఆరోగ్యం కుదుట‌ప‌డ‌టంతో వచ్చే నెల ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement