Sunday, May 19, 2024

Counter – ట్విట్ట‌ర్ లో బిజెపి కార్టూన్ … మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత ….

హైద‌రాబాద్ – మ‌హిళ రిజ‌ర్వేష‌న్ బిల్లును కేంద్రం ఆమోదించాల‌ని ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేయ‌డంతో ఆ పార్టీ త‌న ట్విట్ట‌ర్ లో తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు సీట్లు ఇవ్వ‌లేద‌నే అర్ధం వ‌చ్చేలా ఒక కార్టూన్ పోస్ట్ చేసింది.. దీనిపై క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. వ్య‌క్తిత్వ హ‌ననం చేయ‌డంలో బిజెపి ఎప్పుడూ ముందు ఉంటుందంటూ ఫైర్ అయ్యారు. మహిళలపై దాడి చేయడం ఆపాలని బీజేపీకి సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

కాలంచెల్లిన మూస పద్ధతిలో మహిళలలో అవహేళన చేయడం తగదని స్పష్టం చేశారు. మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేక పోతుందా అని అడిగారు. మహిళ హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చ‌ట్ట స‌భ‌ల‌లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌లిపించిన‌ట్ల‌యితే మ‌హిళ‌లు మ‌రింత ముందుకు సాగుతార‌ని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement