Monday, April 29, 2024

Congress Protest – దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్దం…

చెన్నూర్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిరసిస్తూ టిపిసిసి ఆదేశాలమేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గ కేంద్రంలో అధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అంబేద్కర్ చౌక్ వరకు కెసిఆర్ దిష్టి బొమ్మ తో యాత్ర నిర్వహించి దగ్దం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలను దగ చేసి ఎన్నికలు సమిపిస్తుడడం దశాబ్ది ఉత్సవాల పేరుతో మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్నూరి శ్రీధర్ పాతర్ల నాగరాజు రామిల్ల రాధిక తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement