Sunday, April 28, 2024

CM KCR : రియల్‌ సింగిల్‌ విండో విధానంతో లక్షల కోట్ల పెట్టుబడులు : కేసీఆర్‌

రియల్‌ సింగిల్‌ విండో విధానంతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేథా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘మేథా ఫ్యామిలీ మెంబర్స్‌కు శుభాకాంక్షలు. రైల్వే మ్యానుఫ్యాక్చర్‌ చేస్తారంటే ఊహించలేదు. విడివిడి భాగాలను ఎంత స్కిల్‌తో చేస్తున్నారో కశ్యప్‌రెడ్డి స్వయంగా చూపించారన్నారు. కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మేథా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా గర్వపడుతున్నామన్నారు. తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును, రూ.2500కోట్ల పెట్టుబడితో ఫేజ్‌-1ను పూర్తి చేసి, మ్యానుఫ్యాక్చరింగ్‌ పూర్తి చేసి ఈ రోజు నాతో ప్రారంభింపజేసుకున్నారన్నారు.

హైదరాబాద్‌లో ఫార్మా, ఫౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగింది. జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి దాదాపు మూడింట ఒకటో వంతు ప్రపంచానికి సరఫరా చేస్తున్నాం. ఎక్కడ అభ్యుదయ పథంలో, ప్రగతి పథంలో గుభాళించాలన్న.. బ్రహ్మాండంగా రావాలన్న దానికి సంబంధించి ఎకో బిల్డ్‌ కావాలి. ఈ ఎకోలో భాగంగానే కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ను తీసుకువచ్చామన్నారు. టీ ఐపాస్‌ తీసుకువచ్చినప్పుడు నేను శ్రమపడ్డ. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో బిజినెస్‌ మీటింగ్‌లో పాల్గొన్న సందర్భంలో చాలా గర్వంగా చెప్పేవాడినన్నారు. ప్రపంచంలో భారతదేశంతో పాటు చాలా చోట్ల సింగిల్‌ విండోలున్నాయన్నారు. ఫార్స్‌, బోగస్‌ ఎంఓయూలు కాకుండా రియల్‌ స్పిరిట్‌లో చేస్తున్నామన్నారు. ఎంత కఠిన చట్టం తీసుకువచ్చామంటే.. 15రోజుల్లో అనుమతి ఇచ్చి క్లారిటీ ఇవ్వకపోతే ప్రాజెక్ట్‌ సాంక్షన్డ్‌ అని చెప్పినమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement