Friday, April 26, 2024

జగ్గారెడ్డి పెద్ద మనసు.. కొవిడ్ బాధితులకు సాయం

తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతోంది. అయితే సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో కోవిడ్ బాధితులకు,ఆక్సిజన్ అవసరమున్న వారికి  అందుబాటులోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ లో కోవిడ్ తో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న బాధితుల కోసం తన శక్తి మేరకు సహాయం చేసేందుకు కృషి చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికే ఫీల్డ్ లో ఆక్సిజన్ అవసరమున్న వారికోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న సిబ్బంది, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి, కౌన్సిలర్ షఫీ హఫీజ్ అందుబాటులో వుండి అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 60 సిలిండర్లు సొంతంగా తీసుకొని అవసరమున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసినట్లు వెల్లడించారు. త్వరలో మరో 100 ఆక్సిజన్ సిలిండర్ లు తెప్పిస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement