Sunday, May 19, 2024

Congress – మా ప్ర‌భుత్వాన్నికూల్చ‌డం అసాధ్యం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌


కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరమూ కాదని ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చామని.. అయిదేళ్లు పాలిస్తామని అన్నారు. ప్రజల తమపై నమ్మకంతో అధికారం ఇచ్చారని.. సంపద సృష్టించి వాళ్లు అందిస్తామన్నారు. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. , దేశంలో రిజర్వేషన్ల రద్దు బీజేజీ అంజెడాగా మారింద‌న్నారు. రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గు చేటు అని మండిప‌డ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే భవిష్యత్ ఉండదని, దేశంలోని బలహీన వర్గాలు, దళిత, గిరిజనులు తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని భ‌ట్టి హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణలో కుల గణన ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు.

డిమాండ్‌కు త‌గ్గ‌ట్టు ప‌వ‌ర్ స‌ప్ల‌య్ చేస్తున్నాం..

- Advertisement -

రాష్ట్రంలో పవర్ సప్లైపై ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి మాట్లాడుతూ.. అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో ఆరవ తారీఖు వరకు నమోదైన సరాసరి డిమాండ్, వినియోగాన్ని గతేడాదితో పోల్చుకుంటే మే నెల ఒకటి నుండి ఆరోవ తేదీ వరకు 52.9 శాతం పెరుగుదల నమోదయిందన్నారు. మే 2023లో 7062 మెగావాట్లుగా ఉన్న సరాసరి డిమాండ్ 10799 మెగావాట్లకు పెరిగింది. అలాగే సరాసరి వినియోగం సైతం 157.9 మిలియన్ యూనిట్ల నుండి 226.62 మిలియన్ యూనిట్లకు పెరిగి, 43.5 శాతం పెరుగుదల నమోదు చేసిందన్నారు.

గ్రేట‌ర్‌లో విప‌రీతంగా విద్యుత్ వాడ‌కం..

గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఏడాది మే నెల ఆరు వరకు నమోదయిన సరాసరి డిమాండ్, వినియోగాన్ని గతేడాదితో పోల్చుకుంటే మే నెల ఒకటి నుండి ఆరోవ తేదీ వరకు 47.6 % పెరుగుదల నమోదయ్యింది. గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ వినియోగం పెరుగుతున్నా త‌మ‌ సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా వుంటూ ఎక్కడ కూడా నిమిషం పాటు అంతరాయం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ విధిగా కృషి చేస్తున్న సిబ్బందిని అధికారులను అభినందించాల్సిన ప్రతిపక్షాలు లేని కరెంటు కోతలను ఉన్నట్టు ప్రచారం చేస్తూ గోబెల్స్‌కు తాతలుగా వ్యవహరిస్తున్నారని భట్టి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement