Monday, May 13, 2024

రేప‌టి నుంచి సెకండ్‌ ఇయర్ స్టూడెంట్స్‌కి క్లాసులు.. జులై 1 నుంచి ఫస్ట్‌ ఇయర్ కు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేటి నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. జూలై 1 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈసారి టెన్త్‌ ఫలితాలు ఆలస్యంగా విడుదల కానుండటంతో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. ఈ రోజు నుంచి సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు కళాశాలలకు వెళ్లనున్నారు.

ఈరోజు(15న) ఇంటర్‌ ఫలితాలు విడుదలవుతాయంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఇంటర్‌ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఫలితాలు ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీలోపు ఇంటర్‌ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. పోస్ట్‌ వ్యాల్యుయేషన్‌ పనులు ప్రస్తుతం అధికారులు చేపడుతున్నారు. ఇక టెన్త్‌ పరీక్షలు మే నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరిగాయి. ప్రస్తుతం స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్‌ 25 లేదా 26న ప్రకటించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement