Saturday, November 30, 2024

HYD : కాంగ్రెస్ సునామీలో కారు కొట్టుకుపోవడం ఖాయం.. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్

ఎల్బీనగర్, నవంబర్ 16(ప్రభ న్యూస్) అన్ని వర్గాల ప్రజల మంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ గౌడ ఆత్మీయ సమ్మేళనం ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ త‌న పై జరిగిన దాడిని మీరంతా చూశారని, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మన గొంతుక అసెంబ్లీలో వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో కుట్రలు, ఎందరో గూఢాచారులు నా చుట్టూ తిరుగుతున్నా, తాను నీతి నిజాయితీ గల వ్యక్తిని, ధర్మం నావైపు ఉంద‌న్నారు. ప్రకృతి నాకు సహకరిస్తదని, అంతకు మించి త‌న‌కు తోడుగా మీరంతా ఉన్నారనే కొండంత ధైర్యం ఉంద‌న్నారు. కాంగ్రెస్ సునామీలో కారు కొట్టుకు పోవడం గ్యారంటీ అన్నారు. కార్యక్రమంలో వజీర్ ప్రకాష్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ బుడ్డ సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, కృపాకర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement