Wednesday, May 22, 2024

Book | గాఢ రస భక్తి కావ్యం ‘ఉగ్రం‌‌-వీరం’.. ఆవిష్క‌రించ‌నున్న కేసీఆర్‌

తిరుమల సహా.. అహోబిలం నుంచి యాదాద్రి వరకూ విస్తరించిన వేంకటేశ్వర, నారసింహ వైష్ణవ సంబంధితమైన సుమారు వెయ్యి ఆలయాలకు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు , ఉమ్మడి ఏపీ పూర్వ ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక అపురూపమైన శ్రీలక్ష్మీ నారసింహస్వామి మంత్ర పేటికను ఉచితంగా సమర్పించనున్నారు.

భక్తి లక్షణకారులు మాట్లాడుకునే మధుర భక్తీ , ముగ్ధభక్తీ , వీరభక్తీ, గాఢ రసభక్తీ నిండిన ఈ అద్భుతమైన గ్రంథ సంపద పేరు ‘ ఉగ్రం .. వీరం’, సుమారు వందపేజీలతో అఖండ భక్తి చైతన్యాన్ని విరజిమ్ముతున్న మంత్ర బలాల దివ్యగ్రంధాన్ని ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మహాద్భుతంగా , పరమాద్భుతంగా , అత్యంత ఆకర్షణీయంగా , పరమ పవిత్రంగా అందించడం విశేషంగా చెప్పి తీరాలి.

- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లతో పాటు, దర్శక నిర్మాతలకు, రచయితలకు , సాంకేతిక వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఇరవై ఐదు పీఠాలకు, పన్నెండు మఠాలకు , మూడు వందల ధార్మిక మండళ్లకు , సుమారు వంద పత్రికల, ఛానెళ్ల, సోషల్ మీడియా ప్రతినిధులకు , రెండు రాష్ట్రాల న్యాయమూర్తులకు , న్యాయవాదులకు పొన్నాల లక్ష్మయ్య ఈ చక్కని ఉత్తమ గ్రంధాన్ని ఉచితంగా అందించనున్నట్లు సమాచారం .

మానవ సమూహాలమధ్య వొత్తిళ్ళు , సంఘర్షణలు ఎక్కువై మానసిక శాంతిని కోల్పోతున్న వర్తమాన కాలానికి పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న జీవన సార్ధకతల అపురూప గ్రంధాలు కల్యాణప్రదమైన మహత్కార్యాలుగా దర్శనమిస్తున్నాయని, ఈ నారసింహుని గ్రంధం అందంలో ప్రహ్లాదుని జయగాథ పరమ ఉత్తేజ భరితంగా సాగిందని …. శ్రీనివాస్ ని ప్రసింసిస్తూ .. గతంలో చండీయాగం తో ఈ దేశాన్నే ఆకర్షించిన కల్వకుంట్ల చంద్ర శేఖర రావు వంటి రాజకీయ యోధుని క్షేమం కోరుతూ పొన్నాల లక్ష్మయ్య ఈ బలమైన గ్రంధాన్ని ఇంత అందంగా ముద్రించి ఉచితంగా సమర్పించడంతో పొన్నాల చరిత్ర కెక్కినట్లేనని తెలంగాణా పండిత శ్రేణులు సైతం అభినందని వర్షిస్తున్నాయి.

రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల ప్రముఖులకూ సైతం ఈ పురాణపండ నృసింహుణ్ణి అందించాలనే పొన్నాల లక్ష్మయ్య మహా సంకల్పంలా ఇంత వరకూ ఏ రాజకీయ నాయకులూ ఈ ఆచరణాత్మక సంకల్పం చెయ్యలేదని తెలంగాణా భవన్ కు చెందిన బీ ఆరెస్ శ్రేణులు బాహాటంగా పొన్నాల , పురాణపండ పై ప్రశంసలు వర్షించడం గమనార్హం.

ఇంతటి మహోజ్వల మంత్ర వైభవాన్ని ఆవిష్కరిస్తున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి విశేష భక్తులు , తెలంగాణా పూర్వ ముఖ్యమంత్రి, బీ ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు కే సి ఆర్ కి దైవబలం పుష్కలంగా ఉందని జ్యోతిష పండితులు పదే పదే
పేర్కొనడం గమనార్హం.

ఏదేమైనా ‘ శ్రీనివాస్ చెయ్యి పడ్డ ప్రతీ బుక్కూ హిట్టే … సగటు తెలుగు భక్త పాఠకుడికి ఆయన తేనె తుట్టే ‘ …. అంటూ .. రసజ్ఞులు అభినందనల చందనాలు వర్షిస్తున్నారు.

విఖ్యాత ఆధ్యాత్మిక పారమార్ధిక ప్రచురణల సంస్థ ‘ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ‘ ఈ దివ్య మంత్ర గుచ్చాన్ని మనోహరంగా నాణ్యతా ప్రమాణాలతో ముద్రించడం పాఠకుల్ని మనస్సుకు హత్తుకునేలా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ , విఖ్యాత సంస్కృత ప్రవచన కర్త ఆకెళ్ళ విభీషణ శర్మ పేర్కొనడం మరింత సౌందర్యాన్ని సంతరించుకుందని ప్రచురణకర్తలు సంతోషించడం మరొక మెలి మలుపుగా చెప్పక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement