Saturday, May 4, 2024

Rahul Gandhi : రేపు తెలంగాణ‌కు రాహుల్‌గాంధీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ 17వ తేదిన తెలంగాణ‌లో ప్రచారం నిర్వ హించను న్నారు. రోడ్‌షో లు, కార్నర్‌ మీ టింగ్‌లు, బహిరంగ సభ ల్లో పాల్గొ ననున్నారు. ఢిల్లి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ ఎ్టోరుకు ఉదయం చేరుకుంటారు. శంషాబాద్‌ నుంచి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో పిన పాకకు వెళ్లి మధ్యాహ్నాం 12 గంటలకు పినపాకలో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.

పినపాక నుంచి నర్సంపేటకు చేరుకుని మధ్యాహ్నాం 2 గంటల నుంచి 3 గంటల వరకు రోడ్‌షోకు హాజరవుతారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గంలో కార్నర్‌ మీటింగ్‌ తర్వాత రోడ్డు మార్గాన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు సాయంత్రం 6:30 గంటకు రాహుల్‌గాంధీ చేరుకుంటారు. రాజేంద్రనగర్‌లో సమావేశం తర్వాత ఢిల్లిdకి తిరుగు పయనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement