Wednesday, May 8, 2024

TS: కుల జన గణన తిరుగులేని అస్త్రం… రాహుల్‌గాంధీకి ధ‌న్య‌వాదాలు…సీఎం రేవంత్‌

ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వెనకబడిన తరగతులకు సమన్యాయం, సామాజిక న్యాయం దక్కడానికి ఈ కుల జన గణన తిరుగులేని అస్త్రం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యనించారు. అసెంబ్లీలో కుల గణన తీర్మాణాన్నిప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయన రాహుల్​గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.

‘కొన్ని నిర్ణయాలు సమాజ గతిని సమూలంగా మార్చుతాయి. తరతరాల అన్యాయానికి చరమగీతం పాడుతాయి. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్క తేల్చాలన్న ప్రజా ప్రభుత్వం నిర్ణయం అటువంటిదే. ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వెనకబడిన తరగతులకు సమన్యాయం, సామాజిక న్యాయం దక్కడానికి ఈ కుల జన గణన తిరుగులేని అస్త్రం అవుతుంది. ‘మేమెంతో మాకంత’ అన్న బలహీన వర్గాల వాదనతో గొంతు కలిపి.. ఆ దిశగా నిర్ణయం చేయడానికి మాకు దిశానిర్దేశం చేసిన రాహుల్ గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు.’అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement