Sunday, April 28, 2024

TS: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై హరీష్ రావు అభ్యంతరం..

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రీవు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలోని నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. శనివారం ఉదయం ఆ శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను ఆయన వివరించారు. కొత్తగా అన్నారం బ్యారేజీ నుంచి లీకులు మొదలయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కలుగజేసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ఓ టెక్నీషియన్‌ను సభలోకి తీసుకొచ్చిందన్నారు.

దీనిపై హరీష్ రావు స్పందిస్తూ.. సభలో సభ్యులు కాని వారిని లోనికి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. కేవలం రాష్ట్ర మంత్రులే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం కూడా టెక్నీషియన్‌ను సభలోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement