Wednesday, May 8, 2024

BJP Campaign – తొమ్మిదేళ్ల‌లో మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు, అభివృద్ది ప‌నులు భేష్ – డి కె అరుణ‌

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) జులై 17 (ప్రభ న్యూస్) మేధావులను కలిసే కార్యక్ర‌మాన్ని సోమవారం రోజు గద్వాల పట్టణంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డికె. అరుణ మాట్లాడుతూ..గద్వాల పట్టణంలో ఉన్న డాక్టర్స్, లాయర్లు, టీచర్లు, వ్యాపారస్తులు, వివిధ స్థాయిలో ఉన్న మేధావులను కలవడం జరిగిందని, వారి దగ్గరికి వెళ్లి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాలుగా ప్రధానమంత్రి గా దేశం ఎంతో అభివృద్ధిగా ముందుకెళ్ళిందని అన్నారు. సంక్షేమ పథకాలు గాని, విదేశాంగ విధానం గాని, మౌలిక వసతులు గాని, భద్రతా విషయంలో, రక్షణ రంగంలో, దేశంలో ప్రతి జిల్లాకు హాస్పిటల్స్ గాని, నేషనల్ హైవేస్ , కరోనా విపత్తు సమయంలో, ప్రజలందరికీ ధైర్యం చెప్పి, ప్రపంచంలో అందరికన్నా ముందుగా , మంచి టీకాలు అందించడం, కరోనా వచ్చినప్పుడు నుంచి నేటి వరకు ఉచిత బియ్యం ఇవ్వడం మోడీకే చెల్లింద‌ని అన్నారు. దేశంలో పేదలందరికీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద , నాలుగు కోట్ల ఇండ్లు నిర్మించి ఇవ్వడం, స్వచ్ఛభారత్ కింద టాయిలెట్లు ఇవ్వడం, ఉజ్వల కింద గ్యాస్ ఇవ్వడం , స్థానిక సంస్థలైన, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మండల పరిషత్తు లకు, జిల్లా పరిషత్లకు భారీగా నిధులు కేటాయించడం, నిరుద్యోగులకు నూతనంగా ఉద్యోగాలు ఇవ్వడం , అవినీతి రహిత భారతదేశం గా మార్చడం , 370 ఆర్టికల్ గాని , త్రిబుల్ తలాక్ విషయంలో మైనార్టీ మహిళలకు రక్షణ ఉండడం అయోధ్యలో రామాలయం నిర్మాణం ఈ రకంగా చెప్తూ పోతే ఈ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో గత ప్రభుత్వాలు చేయనివి ఎన్నో చేయడం జరిగిందని అని మేధావులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు జమ్మి చెడు ఆనంద్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కబీర్ దాస్ నరసింహ, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి నాగేందర్ యాదవ్, రాష్ట్ర బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుమల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు తుమ్మల నరసింహులు, దాసు, ఎమ్.కె. సత్యం, పాండు రెడ్డి, మోహన్ యాదవ్, కొత్త గణేష్, చంటి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement