Thursday, May 2, 2024

Bifurcation తొమ్మిదేళ్లైనా వీడ‌ని పీఠ‌ముడి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 2014లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాజముద్ర వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ పున ర్విభజన చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా సమస్యలు నానాటికీ జఠిలమవుతూనే ఉన్నా యి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 ప్రకారం పార్లమెంట్‌ ఆమోదించిన ఆంధ్రðప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఈ ఏడాది జూన్‌ 2తో తొమ్మిదేళ్ళు పూర్తయి, పదో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. విభజన ప్రక్రియ పూర్తయి పదేళ్ళు కావస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు హక్కుల భంగం, ఆర్థిక నష్టమే మిగి లింది. గతంలో కొన్ని సందర్భాల్లో రెండు రాష్ట్రా లు సఖ్యతతో ముందడుగు వేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించని కారణంగా చట్టంలోని అనేక అంశాలు అపరిష్కృతంగానే మిగిలాయి. ఈ చట్టంలో అత్యంత కీలకమైన 9వ, 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలు ఇంకా యుద్ధ వాతావరణంలోనే కొనసాగుతున్నాయి. కొన్ని సంస్థల్లో ఉద్యోగులు, చరాస్తుల విభజన జరిగినప్పటికీ ఆర్థిక లావాదేవీల లెక్క తేలలేదు. స్థిరాస్తులు, అప్పులు విభజన జరగలేదు.

అనేక ఒత్తిళ్ళ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో కేంద్రం 29 పర్యాయాలు సమీక్షలు జరిపినప్పటికీ, చిక్కుముడిగా ఉన్న ఏ ఒక్క అంశమూ కొలిక్కి రాలేదు. సామరస్య పూర్వకంగా చర్చించుకుని కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 5 సార్లు భేటీ అయ్యారు. అయినా.. ప్రయోజనం శూన్యమనే రెండు ప్రభుత్వాల్లోని ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. పరిపాలనాపరంగా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాల రాజధానులు వేర్వేరు అయినప్పటికీ, చట్టం ప్రకారం హైదరాబాద్‌ పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణతర విద్యార్థులకు ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఉద్యమానికి మూలబిందువులుగా ఉన్న నీళ్ళు, నిధులు, నియామకాల్లో అత్యంత కీలకమైన కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీలోనూ ఏటూ తేలని అంశాలు అనేకం మిగిలి ఉన్నాయి. ఏ రకంగా చూసినా విభజన చట్టం హామీలన్నీ నీటి మూటలుగానే కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలు అటకెక్కి కూర్చున్నాయి. చట్టంలోని లొసుగులే అదునుగా.. కేంద్రం సాచివేత ధోరణి అవలంబిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని సమూలంగా అధ్యయనం చేసి సవరిస్తే తప్ప తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశాలు లేవని రాజ్యాంగ, న్యాయ నిపుణులు ప్పష్టం చేస్తున్నారు.

ఆస్తుల విభజన చేసేది ఎన్నడు?
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని అంశాలు పరిష్కరించకుండా కేంద్రం సాచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. రాష్ట్రం ఏర్పా-టై తొమ్మిదేళ్లు గడిచినా విభజన సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా, ఉపయోగం లేకుండా పోయింది. పునర్విభజన చట్టం-2014 షెడ్యూల్‌ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు- 91 సంస్థలను, అదేవిధంగా షెడ్యూల్‌ 10లోని ఏపీ స్టేట్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, సింగరేణి కాలరీస్‌తో పాటు- 142 సంస్థల్లోని ఆస్తులు, ఇతర లావాదేవీలను 48:52 ప్రకారం విభజించాల్సి ఉన్నది. కానీ కేంద్రం ఈ అంశాల్లో ఏఒక్కదాన్నీ తేల్చకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నది. ఫలితంగా రెండు రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతోంది.

రెండు రాష్ట్రాలూ అంగీకరించని ‘షీలా’ కమిటీ సిఫారసులు
విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థల్లో ‘షీలా భిడే’ కమిటీ- 68 సంస్థలకు చెందిన ఆస్తులను పంచింది. రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై భిడే కమిటీ- చేసిన సిఫార్సులను రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89శాతం ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ లేకుండా మరో 32సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్‌ 64 ప్రకారం పంచుకోవాలని ఏపీ అడుగుతోంది.

- Advertisement -

ఆస్తులు, అప్పుల పంపకాల్లో గందరగోళం
తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నా ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పులను విభజించుకోవడంతో గందరగోళ పరిస్థితులు వీడలేదు. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ-, తెలుగు అకాడమీ, జేఎన్‌యూ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ-ల విభజన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు- ఉంది. విద్యుత్‌ రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్‌ అధ్యక్షతన ఏర్పా-టైన కమిటీ- ఇప్పటికీ రిపోర్ట్‌ ఇవ్వలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆర్థిక పరమైన అంశాల విభజన, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి వాటి విభజన పూర్తిగా జరగలేదు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌, టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ, మినరల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ వంటి ఆస్తుల పంపకాలపైనా గందరగోళం నెలకొంది.

కేంద్రం నిర్లక్ష్యం, రాష్ట్రాల మధ్య కుదరని సఖ్యత
అత్యంత కీలకమైన అంశాలపై కూడా కేంద్రం జోక్యం చెసుకోకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య సక్యత కుదరలేదు. కొన్ని సంస్థల్లో జాయింట్‌ అకౌంట్ల కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు- రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు. 2014 నుండి, చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో మొత్తం 29 సమీక్షా సమావేశాలను నిర్వహించింది. అయినప్పటికీ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇరు రాష్ట్రాలు పరస్పరం ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. గత ఏడాది కాలంగా కేంద్రంతో కేసీఆర్‌ సర్కారు సఖ్యతలేని కారణంగా విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి అడగడం మానేసింది.

నదీ జలాల వాటాలో హక్కులకు భంగం
గోదావరి, కృష్ణా నదీజలాల వాటాల పంపిణీలోనూ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నది. దేశంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినప్పుడు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌, 262 ఆర్టికల్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. 575 టీఎంసీల నీటి వాటా కోసం కృష్ణా నదీ జలాల పంపకం అంశాన్ని ట్రిబ్యునల్‌కు పంపాలని తెలంగాణ కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ అభ్యర్థనలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది.

జాతీయ హోదాకు దక్కని అవకాశం
తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కాగా ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా మంజూరు చేసింది. అలాగే ఏపీలోని పోలవరానికీ జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది. చట్టప్రకారం ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు ఇవ్వకపోగా తెలంగాణకు మంజూరైన ఐటీ-ఐఆర్‌ను కూడా రద్దు చేసింది. తెలంగాణాలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని ఇదివరకు ముఖ్యమంత్రి రెండు పర్యాయాలు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై తాజాగా మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖ కూడా రాశారు.

వచ్చే ఏడాది నుంచి తెలంగాణతర విద్యార్థులకు షాకే..
ఏపీ స్థానికులకు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం నిర్దేశించిన 15శాతం రిజర్వేషన్‌తో రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ మరియు ఫార్మసీతో సహా తెలంగాణలోని ఎక్కువ మంది స్థానిక విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులను అభ్యసించే అవకాశాన్ని పొందుతారు. అయితే.. ఇది వచ్చే ఏడాది నుండి పనిచేయదు. విభజన సమయంలో, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 (డి) కింద అందించిన ఉమ్మడి అడ్మిషన్‌ ప్రక్రియను 2014లో ప్రారంభమైన 10సంవత్సరాల పాటు- రెండు రాష్ట్రాలకు కొనసాగించాలని తప్పనిసరి చేసింది. దీని ప్రకారం నిబంధన ప్రకారం, ఉన్నత విద్యా సంస్థల్లో (హెచ్‌ఇఐ) రిజర్వేషన్‌లో 85 శాతం సంబంధిత స్థానిక అభ్యర్థులకు మరియు మిగిలిన 15 శాతం అందరికీ అందుబాటులో ఉంటు-ంది.

అడ్డిషన్లలో 85:15 నిష్పత్తిలో వాటా
తెలంగాణలో అడ్మిషన్లలో 85 శాతం రిజర్వేషన్లు స్థానిక విద్యార్థులకు రిజర్వ్‌ చేయబడగా, మిగిలిన 15శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, స్థానికేతరులకు (ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు) కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో 85శాతం సీట్లు- స్థానిక విద్యార్థులకు రిజర్వ్‌ చేయబడి, 15శాతం ఓపెన్‌గా ఉండటంతో అదే రిజర్వేషన్‌ విధానం వర్తిస్తుంది.

వృత్తిపరమైన కోర్సుల్లో ప్రయోజనాలు బంద్‌
తెలంగాణలో విద్యావకాశాలు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌, ఉద్యోగ అవకాశాలతో పాటు- ఐటీ-, ఫార్మసీ, లైఫ్‌ సైన్సెస్‌, ఇతర రంగాల వేగవంతమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి సంవత్సరం ఉమ్మడి అడ్మిషన్‌ ప్రక్రియలో రాష్ట్రంలోని వివిధ వృత్తిపరమైన కోర్సుల్లో పెద్ద సంఖ్యలో ఆ విద్యార్థులు చేరుతున్నారు. తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ -టె-స్ట్‌ (టీఎస్‌ ఎంసెట్‌) 2023 ఫలితాల్లో ఆ విద్యార్థులు టాప్‌ ర్యాంక్‌లను -కై-వసం చేసుకున్న ఫలితాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి అడ్మిషన్‌ ప్రక్రియ 2024లో ముగుస్తుంది, స్థానికులకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.

ముప్పైకి పైగా వినతులు అపరిష్కృతం
విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వినతులు కలిపి 30కి పైగా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్నాయి. పార్లమెంటు- సమావేశాల్లో వీటిని ప్రస్తావించడంతో పాటు- కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. స్థాయీ సంఘ సమావేశాల్లోనూ చర్చించారు. అయినా ఫలితం శూన్యం.

బకాయిల విడుదల విజ్ఞప్తులు భేఖాతర్‌
తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్‌ల కర్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం, ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు, జాతీయ శాస్త, విద్యా పరిశోధన సంస్థ ఏర్పాటు-, హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద రూ.451 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వివిధ రకాల పన్నుల్లో రాష్టరం వాటాగా రావాల్సిన నిధులు కూడా విడుదల కావడం లేదని కేసీఆర్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

13వ ఆర్థిక సంఘం సిఫార్సులు ప్రశ్నార్థకం
మిషన్‌ భగీరథ, కాకతీయలకు నీతిఆయోగ్‌ సిఫార్సు చేసిన రూ.19,205 కోట్ల చెల్లింపు, మిషన్‌ కాకతీయ నిర్వహణకు ఏటా రూ.1000 కోట్ల చెల్లింపులు, జాతీయ ఆకృతి సంస్థ (ఎన్‌ఐడీ), ఐఐఎం ఏర్పాటు-, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సింగరేణి బొగ్గుగనులను విద్యుత్‌ కేంద్రాల అవసరాలకు కేటాయించడం, 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2027 కోట్ల బకాయిలు, ఐటీఐఆర్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నివ్జ్‌ుకు రూ.5000 కోట్ల కేటాయింపు, వరంగల్‌ మెగా జౌళి పార్కుకు కేంద్రం నిధులు, ఔషధనగరికి సాయం, ఆదిలాబాద్‌లో సిమెంట్‌ పరిశ్రమ పునరుద్ధరణ లాంటి అంశాలను కేంద్రం ఇప్పటివరకు పరిశీలన కూడా చేయలేదు. అలాగే ప్రధానమంత్రి కిసాన్‌ సంచాయ్‌ యోజనలో ఎస్సారెస్పీ వరద కాల్వను చేర్చమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రిని రాష్ట్ర ఎంపీలు అనేక సందర్భాల్లో కోరారు. అయినా, కేంద్ర సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు. అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్‌లో ట్రిపుల్‌ఐటీ-, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, సీతారామ ప్రాజెక్టుకు నిధులు, రైల్వే ప్రాజెక్టు, జాతీయ రహదారుల పనులకు బడ్జెట్‌ మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెంపు, రామప్ప దేవాలయానికి జాతీయ వారసత్వ గుర్తింపు హైదరాబాద్‌ చుట్టూ రెండో ఓఆర్‌ఆర్‌ నిర్మాణం, పౌరసరఫరాల సంస్థకు బకాయిల చెల్లింపు, కొత్త పోలీసు రిజర్వ్‌ బెటాలియన్ల ఏర్పాటు- వంటివి ఇందులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement