Saturday, December 7, 2024

బండి సంజయ్ కు తెలిసే పేపర్ లీకేజీలు : మంత్రి గంగుల

బండి సంజయ్ కు తెలిసే పేపర్ లు లీకేజీలు జరుగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బుధవారం కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లీకేజీలు బీజేపీ కుట్ర అని జనం అంటున్నారని, దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ అయ్యాక సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదన్నారు. కమలాపూర్ లో లీకేజీ చేసిన ప్రశాంత్ అనే యువకుడు బండి సంజయ్ తో వందల కాల్స్ చేశారని, వాట్సాప్ చాట్ లను ఢీకోడ్ చేస్తాం అన్నారు. ఎంతటి వారైనా శిక్ష తప్పదని, బీజేపీ విష రాజకీయాలకు తెరలేపిందన్నారు. బీఆర్ఎస్ ను లీకేజీ ప్రభుత్వంగా చిత్రీకరించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ దిగజారి ప్రవర్తిస్తుందని అన్నారు. బండి సంజయ్ ని నేరుగా అడుగుతున్నా పేపర్ లీకేజీలో బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి A2 ముద్దాయి అతను బీజేపీ నాయకుడు, హిందీ పేపర్ లికేజీలో ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అన్నారు. బండి సంజయ్ కి పేపర్ రాగానే బీజేపీ గ్రూపుల్లో ప్రచారం చేశారు.. ఇది నిజం కాదా అన్నారు. అశాంతి అలజడి రేపి బీహార్ సంస్కృతి తెలంగాణను మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి గంగుల ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement