Tuesday, May 7, 2024

ADB: ప్రజాపాలన గ్రామ సభలు షురూ

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనోఫెస్టోలో బాగామైన ఆరు గ్యారెంటీల్లో ఐదు పథకాల కు దరఖాస్తుల స్వీకరణకు సబందిత అధికారులు గురువారం ఉదయం నుంచి శ్రీకారం చుట్టారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని 18 వార్డులలో అధికారులు ప్రత్యేక కేంద్రాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు దరఖాస్తు ఫారంలను అందేజేస్తున్నారు.

తిరిగి దరఖాస్తులను లబ్దిదారుల సంబంధిత ఆధారాల పత్రాలను జతచేసి సమర్పించాలని సూచిస్తున్నారు. జనవరి 6వ తేది వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది వార్డులలో అధికారుల చేపడుతున్న కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement