Monday, April 29, 2024

70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం..

కాసిపేట, ఏప్రిల్‌ 8 (ప్రభన్యూస్‌): గత రెండేళ్ళుగా సింగరేణిని నష్టాలు వెంటాడుతున్న నేపధ్యంలో ఈ ఏడాది వాటిని అధిగమించేందుకు ముందస్తుగానే చర్యలు చేపట్టింది. అందుకుగాను గత వార్షిక ఉత్పత్తి ఏడాది ముగియగానే సంస్థ సి ఆండ్‌ ఎండి శ్రీధర్‌ డైరెక్టర్లతో, ఏరియా జనరల్‌ మెనేజర్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దిశనిర్ధేశం చేశారు. 2019-2021 వరకు సంస్థ నిర్ధేశించిన టార్గెట్‌ను ఎందుకు సాధించలేకపోయాం, ప్రతికూల పరిస్థితులు ఏమిటి, వాటిని అధిగమించి అనుకున్న లక్షాలను ఏవిధంగా సాదించగలమనే పలు విషయాలపై సుధీర్ఘంగా చర్యలు జరిపారు. కరోనా.. అతి వర్షాలు ఒక కారణమైతే కార్మికుల గైరాజరు శాతం, దొంగ మస్టర్లు, కొరవడిన జవాబుదారితనం తదితర అంశాలు మరో కారణంగా గుర్తించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే సూచనలు చేసినట్టు సమాచారం. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని భవిష్యత్‌ టార్గెట్‌ సాధించేందుకు చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపద్యంలోనే 2021-22 ఏడాదికి 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణ, దాదాపు 450 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ సాధించాలలే టార్గెట్‌తో వున్న యాజమాన్యం అందుకు అధికారులు, కార్మికులను మానసికంగా సంసిద్దులను చేసేందుకు కార్యచరణలోకి దిగింది. ఏరియా స్థాయి అధికారులు గనులపై సమావేశాలు ఏర్పాటు చేస్తూ కంపేనీ ముందున్న లక్షాలు, కార్మికులకు అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలు, 2014 నుండి సంస్థలో జరిగిన సంస్కరణలు, సాధించిన విజయాలు, పెట్టుకున్న లక్షాలు తదితర పలు ఆంశాలను కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటు జరిగాక సింగరేనిలో తీసుకువచ్చిన నూతన గనులు, సంస్థ సాధించిన లభాలు, కార్మికులకు వాటా శాతం పంపిని, సోలార్‌, థర్మల్‌ విధ్యుత్‌ ప్లాంట్‌ల ఏర్పాటు, జరుగుతన్న కరెంట్‌ ఉత్పత్తి, గనుల్లో తీసుకువచ్చిన నూతన అవిష్కరణలు, కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సౌకర్యాలు, నిరుద్యోగ యువకుల నియామకాలు, కారుణ్య నియామకాల ప్రక్రియ ద్వరా డిపెండెంట్‌లకు సంస్థలో ఉద్యోగాలు, నూతనంగా చేపట్టబోయే సంస్కరణలు, మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రంలో కెటాయించిన నూతన గనులు తదితర పలు ఆంశాలపై కార్మికులకు వివరిస్తున్నారు. ప్రతి కార్మికుడు అప్పగించిన పనిని నిర్ణీత గడువులోగా, పని నైపుణ్యతతో,ప్రమాదరహిత బొగ్గు ఉత్పత్తిని సాధిస్తే తప్పకుండా ఈ ఏడాది అనుకున్న బొగ్గు ఉత్పత్తి లక్షాలను సాదిస్తామనే భరోసాను కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఏరియా అధికారులు తన పరిదిలోని గ్రూప్‌ ఏజెంట్‌. మెనేజర్లు, ఇతర అధికారులతో స్థానికంగా వున్న ఇబ్బందులు, వాటి పరిష్కారంతో పాటు గనులకు, ఏరియా టార్గెట్‌లు పెట్టుకుని వాటిని అధిగమించాలనే లక్షంతో వున్నారు. ఏమైనా గత రెండేల్లలో టార్గెట్‌ సాదనలో వెనుకబడిన సంస్థను ఈ ఉత్పత్తి
సంవత్సరానికి నిర్ధేశించుకున్న 70 మిలియన్‌ టన్నుల బొగ్గును సాధించాలనే పట్టుదలతో యాజమాన్యం వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement