Saturday, April 27, 2024

జైలులో బిజెపి కార్య‌క‌ర్త‌ల‌కు బండి సంజ‌య్ ప‌రామ‌ర్శ – పోలీసుల తీరుపై మండిపాటు

ఆదిలాబాద్: భైంసా అల‌ర్ల‌కు కార‌ణ‌మైన వారిని కాకుండా త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేశారంటూ బిజెపి తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు.. జిల్లా జైలులో భైంసా అల్లర్లలో అరెస్టు అయిన కార్యకర్తలతో ములాఖత్ అయ్యారు. కార్యకర్తలను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.. పార్టీప‌రంగా అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ, భైంసా అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమాయకులను భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి కేసులు పెట్టారని పోలీసుల వైఖరీపై ధ్వజమెత్తారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మానవత్వం లేదని అంటూ ఓవైసీ కోసం హిందువులను కెసిఆర్ బలి చేస్తున్నార‌ని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కొడుక్కు అదే గతి పట్టిస్తామని హెచ్చరించారు. కాగా, స్వేరోస్ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులే హిందు మతానికి వ్యతిరేకంగా సంస్థలు నడుపుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక ఐపీఎస్ అధికారి ఆధారాలతో సహా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఆసంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement