Tuesday, April 23, 2024

మీ సేవ నిర్వాహాకుల నిలువుదోపిడి

యాచారం : యాచారం మండలంలో మీసేవ నిర్వాహాకుల నిలువుదోపిడి రోజు రోజుకి అధికమవుతున్నాయి. మ్యూటేషన్‌లు , రిజిస్ట్రేషన్‌లు రెవెన్యూకు సంబందించిన పనులను ఆన్‌లైన్‌లో చేయడానికి ఆధార్‌ సెంటర్‌లో ఫోటోలు దిగే వారు ఫోన్‌ నంబర్‌ నమోదు చేయించే వారి దగ్గరి నుండి మీసేవ నిర్వాహాకులు ప్రజల వద్ద నుండి నిలువున దోచుకుంటున్నారు. ఆధార్‌ నమోదు చేసుకునేందుకు రూ. 50లు చెల్లించాల్సి ఉండగా రూ .100ల నుండి రూ.200ల వరకు తీసుకుంటున్నారు. కొత్తగా ఆధార్‌ తీసుకునే వారి వద్ద నుండి రూ. 200ల నుండి ఆపైగా మనుషులను బట్టి డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రేషన్‌ సరుకులు తీసుకునే వారికి ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబర్‌ తప్పని సరిగ్గా అనుసంధానం చేసుకోవాలని చెప్పడంతో ప్రజలంతా మీసేవ చుట్టు ప్రతి నిత్యం గంటల తరబడి వేచి ఉంటు పనులను చేసుకోని వెళ్తున్నారు. అదే విధంగా భూముల రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను సబ్‌ రిజి ష్టర్‌ కార్యాలయం నుండి తొలగించి ప్రతి మండలంలో తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఎంఆర్‌ఓలకు అనుసంధానం చేయడంతో మీసేవ నిర్వాహాకులకు అడ్డుఅదుపు లేకుండా ప్రజల నుండి డబ్బులు దోచుకుంటున్నారు. ఎకరానికి రూ. 2500లు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం చెపుతున్న మీసేవ నిర్వహాకులు మాత్రం సామాన్య ప్రజల నుండి రూ. 1000ల నుండి రూ .1500ల వరకు అధికంగా తీసుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. మరికొందరు మీసేవ నిర్వాహాకులు పేద, మధ్య తరగతి ప్రజల మ్యూటేషన్‌లు భూ రిజిస్ట్రేషన్‌ల కోసం స్లాట్‌ బుకింగ్‌లకు వెళ్తే మరో 15 రోజుల నుండి నెల రోజుల వరకు బుకింగ్‌లు లెెవంటూ కరాకండిగా చెప్పేస్తున్నారు. యాచారం మండల పరిధిలో పెద్ద పెద్ద భూస్వాములు, రియల్‌ స్టేట్‌ వ్యాపారులు కోట్ల రూపాయలు పెట్టి భూములను కొనుగోలు చేసి వెంచర్లుగా చేస్తున్న వారికి మాత్రమే స్లాట్‌లను బుకింగ్‌లు చేస్తు వారికి అండగా ఉంటూ తహసీల్దార్‌ కార్యాలయంలో దగ్గర ఉండి మరి పనులు చేసి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కావున ఇప్పటికైన అధికారులు కల్పించుకోని మీసేవ నిర్వాహాకులపై తగిన చర్యలు తీసుకోని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మీసేవ నిర్వాహాకులపై మాకు కూడ ఫిర్యాదులు వస్తున్నాయి – డిప్యూటి తహసీల్దార్‌ కార్తీక్‌
యాచారం మండలంలో ఉన్న మీసేవ నిర్వాహాకులపై కొంత మంది తమ దృష్టికి తీసుకు వచ్చారని కానీ ఎవరు కూడ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వలేదని అన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మీసేవ నిర్వాహాకులు ఎవరైన ప్రభుత్వ ధరల కన్న ఎక్కవగా తీసుకుంటే ఉరుకునేది లేదని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా రూ.100ల స్టాంప్‌ పేపర్‌లు తప్పని సరి అంటూ ప్రజలను వేధిస్తున్నారని కావున రిజిస్ట్రేషన్‌లు చేసుకునే వారు కేవలం స్టాంప్‌ డ్యూటి చలాన్‌లు చెల్లిస్తే చాలని కొంత మంది తప్పని సరిగా వంద రూపాయల స్టాంప్‌ అవసరమని చెపుతూ అమయక ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నట్లు సమాచారం వచ్చిందని బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తమ దృష్టికి తీసుకు వస్తే పై అధికారులకు నివేదికను అందించి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
—————————————————————————

Advertisement

తాజా వార్తలు

Advertisement