Saturday, April 27, 2024

స‌రైన‌ పత్రాలు లేని 89 బండ్లు సీజ్​.. నేరాలకు పాల్పడితే తాటతీస్తామన్న ఏసీపీ

చట్టవ్యతిరేక కలపల పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి హెచ్చరించారు. గురువారం సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సోదాలు నిర్వహించారు. అనుమతి లేని 89 వాహనాలతో పాటు ఎనిమిది క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం సీజ్ చేశారు. రౌడీషీటర్లు, గతంలో నేర చరిత్ర గల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు కాలనీలో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్ కుమార్, ఎస్సైలు ఉపేందర్, లక్ష్మణ్, వెంకట కృష్ణ, వెంకటేష్, రవీందర్, రాజ వర్ధన్ శివాని, సునీత తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement