Thursday, December 5, 2024

TS: మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌లో 21 శున‌కాల‌ కాల్చివేత …నిందితుల కోసం పోలీసుల వేట

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో 21 వీధికుక్కలను కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయుధాల చట్టం, జంతువులపై క్రూరత్వం చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో జరిగిందీ ఘటన.

- Advertisement -

వివ‌రాల‌లోకి వెళితే ఆయుధాలు చేతబట్టిన గుర్తు తెలియని దుండగులు ఈ మారణహోమానికి తెగబడ్డారు. వారి కాల్పుల్లో మరికొన్ని శునకాలకు గాయాలయ్యాయి. కాల్పుల్లో మరణించిన శునకాలకు పశుసంరక్షణశాఖ పోస్టుమార్టం నిర్వహించింది. దీనిపై అడ్డకల్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. శునకాలకు తొలుత విషం పెట్టి ఆ తర్వాత అతి సమీపం నుంచి కాల్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దుండగులు ఉపయోగించినవి నాటు తుపాకులు అయి ఉంటాయని పేర్కొన్నారు.

ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగడం లేద‌న్నారు. . శునకాల కాల్చివేతకు గల కారణంపై ఆరా తీస్తున్నారు. అయితే, ఇదే ఘటనలో చనిపోయిన రెండు శునకాల శరీరాలపై ఎలాంటి తుపాకి గాయాలు లేకపోవడంతో అవి విష ప్రయోగం వల్ల చనిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement