Monday, May 6, 2024

Safe Delivery – అంబులెన్స్ లో పురిటి నొప్పులు – ప్ర‌సవం చేసిన 108 సిబ్బంది..

కౌకూరులో నిండు గర్భిణికి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తక్షణమే స్పందించి వారి వద్దకు వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేశారు.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎమర్జెన్సీ ఫిజీషియన్ డాక్టర్ అన్వేష్ కి వివరించారు.. హాస్ప‌ట‌ల్ కు తీసుకొచ్చేంత స‌మ‌యం లేద‌ని సిబ్బంది డాక్ట‌ర్ కు తెలిపారు.. అయితే సిబ్బందే సాధారణ కాన్పు చేయమని సలహా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే కౌకూరు లో నివాసముండే జినాథ్ బేగం వయసు 26 పురిటి నొప్పులు అధికమవడం వలన 108 సిబ్బంది ఈఎంటి బి.నరేష్, పైలెట్ నాసరిరాంబాబు , కుటుంబ సభ్యుల సహకారంతో అంబులెన్స్ లో సాధారణ ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది. ప్రసవ సమయంలో బొడ్డుతాడు బేబీ మెడకి రెండు వరుసల చుట్టుకొని ఉండటం గమనించిన ఈఎంటి ERCP Dr అన్వేష్ కి ఫోన్లో వివరించి వారి సూచనల మేరకు చాకచక్యంగా తొల‌గించారు.. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. సకాలంలో స్పందించి, ప్రసవ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి తల్లి బిడ్డలను క్షేమంగా ఉన్నందున పేషంట్ బంధువులు, మరియు ఆసుపత్రి వైద్యులు 108 సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement