Thursday, May 26, 2022

HYD: యువకుడిని నరికి చంపిన దుండగులు

హైదరాబాద్లోని లంగర్‌హౌస్‌లో దారుణ హత్య జరిగింది. దుండగులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. పిల్లర్ నెంబర్ 96 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా లేక ఇతర కారణాలవల్ల జరిగిందా అనేదానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement