Saturday, May 4, 2024

కరోనాతో వందల మంది చనిపోతుంటే… వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం!

ఏపీలో కరోనా పరిస్థితిని పట్టించుకోకుండా వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో రోజుకు వందలాదిమంది చనిపోతుంటే.. కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సరదాల్లో మునిగారు. ప్రజల రక్షణ పక్కన పెట్టి సరదాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యేల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకేపాడు ఎస్టేట్ లో ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీ చేస్తున్నారు.

కరోనా పరిస్థితిని పట్టించుకోకుండా వైసీపీ నేతలు సరదాల్లో మునిగితేలడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బెడ్లు దొరక్క బయట, బెడ్లు దొరికి ఆక్సిజన్ లేక ఆసుపత్రుల్లో ప్రజలు చనిపోతున్నారు. ఇవేమీ పట్టని వైసీపీ ప్రజాప్రతినిధులు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారు. కరోనా బారిన పడి వందల మంది చనిపోతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సరదాల్లో మునిగి తేలడం దారుణం. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి రుయాకి 60 కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున  ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేసారు. ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకి ప్రజల ప్రాణాలు అంటే ఎంత లెక్కలేనితనమో గుర్రం మీద ఉరేగుతున్న నేతలు ఒక ఉదాహరణ’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

https://twitter.com/naralokesh/status/1391995312839950336
Advertisement

తాజా వార్తలు

Advertisement