Thursday, May 2, 2024

కరోనాకు ఉచిత వైద్యం అందించండి: సీతక్క

ప్రభుత్వం కరోనాకు ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా విలయతాండం చేస్తోందని, పేద ప్రజలు చనిపోతున్నారని అన్నారు. కరోనా మహమ్మారితో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా చితికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకు ఉచిత వైద్యం అందించే వరకు ప్రజలు పోరాటం చేయాలని సీతక్క పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. పక్క రాష్ట్రంలో కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రంలోని ధనం ఎవరి ఖాతాలో వేయాలని చేస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బతికుంటే బలుసాకు తిని బతకచ్చు అని చెప్పిన కేసీఆర్… ఇప్పడు ఆదాయమే ముద్దు అన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని సీతక్క ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement