Saturday, May 25, 2024

పెళ్లి ఫొటోషూట్ లో ..మిస్ ఫైర్ అయిన క్రాక‌ర్స్ తుపాకీ

ఓ పెళ్లిలో వ‌ధూవ‌రులు ఇద్ద‌రు తుపాకీల‌ను చేతిలో ప‌ట్టుకుని ఫొటోల‌కి ఫోజులు ఇచ్చారు. అయితే అది కాస్త బెడిసి కొట్టింది.వధూవరులు వేదికపై ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ జంట చేతిలో మెరుపులుు వచ్చే తుపాకులు ఉన్నాయి. వారు తుపాకీ బటన్ నొక్కినప్పుడు అందులో నుంచి క్రాకర్స్ వస్తూ ఉంటాయి. అయితే… వధువు తుపాకీ నొక్కినప్పుడు.. అది మిస్ ఫైయిర్ అయ్యి.. అది కాస్త పేలింది. ఆమె ముఖానికి తగిలింది. ఈ వీడియో చూసినవారంతా.. అయ్యో పాపం వధువు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పై జాలి పడుతున్నారు. ఈ వీడియోని అదితి అనే మహిళ ఈ వీడియోని నెట్టింట షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement