Sunday, May 5, 2024

నవజోత్ సింగ్ సిద్దూ జైలు నుంచి విడుదల

పంజాబ్ కాంగ్రెస్‌ నేత నవజోత్ సింగ్‌ సిద్దూ పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 10 నెలలుగా పటియాలా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 1988లో కార్ పార్కింగ్ విషయంలో ఓ వ్యక్తితో గొడవపడ్డారు నవజోత్. విచక్షణా రహితంగా ఆ వ్యక్తిని చితకబాదారు. ఫలితంగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించింది. నవజోత్ సింగ్ సిద్దూ కొట్టడం వల్లే అతడు చనిపోయాడని వాదించింది. సాక్ష్యులనూ కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇది సాధారణమైన నేరమే అని తేల్చి చెప్పింది. కేవలం జరిమానాతో సరిపెట్టింది.

దీనిపై అసహనం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మరోసారి తీర్పుని సమీక్షించాలని కోరింది. ఆ తరవాత పూర్తి స్థాయి విచారణ చేపట్టి…ఈ నేరానికి కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పింది. ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా..గతేడాది మే 20న పోలీసులు నవజోత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అయితన ఈరోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. నిజానికి నవజోత్‌కు ఇంకా రెండు నెలల శిక్ష మిగిలే ఉంది. కానీ…సత్ప్రవర్తన ఆధారంగా ముందే విడుదల చేస్తున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement